Sunday 18 August 2019

Invite for Photo Exhibition at Vijayawada by Photogenic Arts Circle on 20th & 21st August 2019

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలతో .. 
Dr. N. భగవాన్ దాస్ గారి శతజయంతి సంవత్సరం సందర్భముగా ఆయన తీసిన ఆపురూప ఛాయాచిత్ర ప్రదర్శనకు ఆహ్వానO .on 20th August 2019 at 10.30 am at The Cultural Center of Vijayawada & Amaravathi, 4th Floor Madhu Malaxmi Chambers, Mogalrajpuram, Vijayawada, 
Dr. N. భగవాన్ దాస్ గారు 1919 సంవత్సరంలో కేరళలోని కాసారగాడ్ లో జన్మిచారు . ఫొటోగ్రఫీ మీద ఎంతో మక్కువ వున్న Dr. N. భగవాన్ దాస్ గారు 1963 లొ గుంటూరు డిప్యూటీ కలెక్టర్ గా వున్న సమయం లొ గుంటూరు రెడ్ క్రాస్ భవనం లో అంతర్జాతీయ ఛాయాచిత్ర ప్రదర్శనను నిర్వహిచటం జరిగినది
1965 లో ఫొటోగ్రఫీ లో ప్రపంచంలోనే ఎంతో ప్రముఖమైన ఫ్రాన్స్ కు చెందిన 'ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్స్ ' సంస్థ నుండి A F I A P అవార్డు ను అందుకున్న మొదటి భారతీయుడు.
ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ 2000 సంవత్సరం లో గుంటూరులో ఏర్పాటు చేసిన జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శనకు ముఖ్య అతిధిగా తన 81సంవత్సరం లో పాల్గొన్నారు, Dr. N. భగవాన్ దాస్ గారు ఏర్పాటు చేసిన మొదటి అంతర్జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శన గుంటూరు లోనే ,Dr. N. భగవాన్ దాస్ గారు చివరిసారిగా ముఖ్య అతిధిగా పాల్గొన్న జాతీయ ఫొటోగ్రఫీ ప్రదర్శన గుంటూరులో కావడం విశేషం . ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో కళాత్మక ఫొటోగ్రఫీని ప్రోత్సహించి ఎన్నో ఫోటోగ్రఫీ సంస్థలు ఆవిర్భావానికి కారకులైన Dr. N. భగవాన్ దాస్ గారు 2001మద్రాసు లో పరమపదించారు.


#Photogenic Arts Circle
Facebook Page: https://www.facebook.com/photogenicartscircle/

#Photography


0 comments: