Tuesday 18 July 2017

Andhra Pradesh news - 17th July 2017 ఏపీ కేబినెట్‌

Andhra Pradesh news - 17th July 2017
ఏపీ కేబినెట్‌ సబ్‌ కమిటి నిర్ణయాలు ఇవే...

అమరావతి: ప్రభుత్వ స్ధలాల క్రమబద్దీకరణపై కేబినెట్‌ సబ్‌ కమిటి భేటీ అయింది. 100 గజాలలోపు స్థలంలో నివాసం ఉన్ననిరుపేద కుటుంబాలకు ఉచితంగా క్రమబద్ధీకరణ చేయాలని నిర్ణయించారు. దారిద్ర్యరేఖ ఎగువున ఉన్న కుటుంబాల నుంచి.. శ్లాబులవారీగా క్రమబద్దీకరణ రుసుం వసూలు చేయాలని సబ్‌ కమిటి నిర్ణయం తీసుకుంది.

కేబినెట్‌ సబ్‌ కమిటి నిర్ణయాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు వేర్వేరుగా రుసుం. గ్రామీణ ప్రాంతాల్లో 100 గజాల లోపు స్థలానికి 30 శాతం. 100 నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం. 251 నుంచి 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 75 శాతం. పట్టణ ప్రాంతాల్లో100 గజాల లోపు స్థలాలకు 15 శాతం.

100 నుంచి 250 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 25 శాతం. 251 నుంచి 500 గజాల వరకు రిజిస్ట్రేషన్ విలువలో 50 శాతం రుసుం వసూలు చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

0 comments: