Tuesday 18 July 2017

ప్రజాప్రతినిధులు - India

*✍🏻ప్రజాప్రతినిధులు ప్రజలకు జవాబుదారీ గాను పారదర్శిక పాలన అందించాలి కానీ 60 ఏళ్ల నుంచి మనపాలకులు తీరుతెన్నులు చూడండి*
✍🏻ప్రజల కొరకు ,ప్రజల చేత,ప్రజల వద్దకు పాలనే ప్రజాస్వామ్య పాలన అన్నారు అలాంటి ప్రజాస్వామ్య పాలనకు విధేయుడిగా ఉంటానని      రాజ్యాంగం మీద ప్రమాణం ప్రజల శ్రేయస్సు,అభివృద్ధి,సంక్షేమం కొరకు నిబద్ధతతో పనిచేస్తాను అని చెప్పిన వ్యక్తులు ప్రజా రక్షకులు గా కాకుండా భక్షకులు లా మారి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రశ్నిస్తే కేసులు ఇది మన ప్రజా ప్రతినిధుల అప్రజక ప్రజాస్వామ్య పాలన.
✍🏻నెలకు లక్షా యాబైయి వేలు జీతం ఇస్తున్నాము.(ప్రజల పన్నులే కదా వాళ్ళ జీతం) కనీసం ఒక్క మంత్రి అయ్యినా, MLA అయ్యినా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా . 10 వేలు ప్రభుత్వ ఉద్యోగి పని చేయక పోతే సస్పెండ్ చేస్తారు.మరి అస్సలు ప్రజలకు దివాంశ సంబుతుడి లాగా సొంత వ్యాపారాలు చేసుకుంటూ అధికారం తో అడ్డగోలుగా సంపాదించే ప్రజాప్రతినిధులకు జీతం అవసరమా.
✍🏻ప్రజా సమస్యలపై చర్చించే ఒక వేదిక అసెంబ్లీ,పార్లమెంట్, కానీ అక్కడ కు వెళ్లి *వ్యాపారాలు చేసి చేసి అలసిపోయి నిద్ర పోయేవాడు ఒకడు, సెల్ లో మాట్లాడుకునే వాడు ఒకడు,* మా నియోజకవర్గంలో విద్యా, ఆరోగ్య, నిరుద్యోగ,రైతులు సమస్యలు ఉన్నాయి అని ఒక్క నాయకుడు అయ్యినా మాట్లాడతాడా మా నాయకుడు గొప్ప అని డబ్బా సోది బూతు పురాణం.అసెంబ్లీ పార్లమెంటు లలో అధికార ప్రతిపక్షాలు కలిసి ప్రజసమస్య ల మీద చర్చించి సమస్యలు పరిష్కరానికి మార్గదర్శకాలు సృష్టించాలి కానీ ఏమీ చేస్తున్నారు .బూతు పురాణం.
✍🏻ఈమధ్య అసెంబ్లీ లోనే చూడలేక చస్తుంటే టీవీ ఛానెల్స్ వాళ్ళు  పొద్దున్నే పందులు సంత పెడుతున్నారు .అక్కడయిన అందరూ చూస్తున్నారూ హుందాగా మాట్లాడి ప్రజా సమస్యల మీద కాలం వినియోగిద్దాం అనే ఇంగిత జ్ఞానం లేకున్నా మా నాయకుడు గొప్ప మా నాయకుడు గొప్ప నువ్వు దొంగ నువ్వు దొంగ ఇదే పందులు సంత రోజూ .మరి మీ నాయకుడు గొప్ప అంటుంటే 60 ఏళ్ళు నుంచి ఇండియా అభివృద్ధి చెందు తున్న దేశం అంటున్నారు తప్ప ఆభివృద్ధి చెందిన దేశం అంటున్నారా
✍🏻 MLA,MLC, Mp లకి ఒక చట్టం చేయాలి .లక్షల్లో జీతం ఇస్తున్నాము కనుక ఎప్పుడూ నియోజక వర్గంలో ఉన్న అన్ని మండలాలు తిరిగి ప్రజా సమస్యలపై తప్ప ఇంకో వ్యాపారం చేయకూడదు.ఎప్పుడూ నియోజక వర్గంలో ఒక ఆఫీస్ పెట్టి ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకూ పని గంటలు నిర్ణయించాలి. సండే ఒక్క రోజు సెలవు ఇవ్వాలి. లీవ్ లు పెడితే శాలరీ కట్ చేయాలి. బయో మెట్రిక్ సిస్టం పెట్టాలి విధులకు డుమ్మా కొట్టకుండా.ప్రజల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకునెలా చట్టాలు రూపొందించాలి.
*✍🏻లక్షా యబయ్యి వేలు ఇస్తున్న ఉద్యోగికి ఇలాంటి పనిగంటలు తప్పా చెప్పండి*
✍🏻గెలిచిన తరువాత హామీలు అమలు మొదటి 3 ఏళ్లలో పూర్తి చేయాలి లేకుంటే పార్టీలను పూర్తిగా రద్దు చేయాలి.
✍🏻ప్రజల్లో గెలిచిన నాయకుడు కి ప్రజల్లో తిరగడానికి సెక్యురిటి అవసరమా కోట్లు ఖర్చు పెట్టి జెట్ సెక్యురిటి అవసరమా. ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి అన్ని కట్ చేయాలి.
✍🏻వీళ్ళు పెట్టే మీటింగ్స్ కి ప్రజలకు పోలీసులు,రెవిన్యూ అధికారులు వారం రోజులు ప్రజలకు అందుబాటులో లేక పోవడం వల్ల తడిపి మోపుడు ప్రజా సమస్యలు పెరిగుతున్నాయి.ఇలాంటి పురాణం మీటింగ్స్ 10 మంది పోలీసులు కంటే ఎక్కువ అవసరమా.
ఇలాంటి చట్టం చేస్తే రాజకీయాల్లో సేవ అంటే ఏమిటో తెలుస్తుంది.
మరి మీరు ఏమంటారు !

(copied)
*✍ Indian politics

0 comments: