Sunday 2 April 2017

భారీగా పెరిగిన వాహన బీమా - 01st April 2017

భారీగా పెరిగిన వాహన బీమా
వాహన బీమా థర్డ్‌ పార్టీ ప్రీమియం రేట్లను 41 శాతం వరకు పెంచుతూ ఐఆర్డీఏఐ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఒక లీటర్‌కు మించి ఒకటిన్నర లీటర్‌ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు థర్డ్‌ పార్టీ ప్రీమియం రూ.2,237 నుంచి రూ.3 వేల 132కు పెంచింది. ఈ కొత్త రేట్లు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయని ఐఆర్డీఏ తెలిపింది. ఒక లీటర్‌ ఇంజన్‌ సామర్థ్యం ఉన్న ప్రైవేటు వాహనాలకు పెంపు వర్తించదు.
ప్రైవేటు ఫోర్ వీలర్స్ వాహనాలు 1,500 సీసీ సామర్థ్యం కంటే అధికంగా ఉన్న వాటికి ప్రీమియం రూ.6,164 ఉండగా, తాజా పెంపుతో రూ.8,630 కానుంది. 7500 కిలో గ్రాముల బరువు వరకు తీస్కెళ్లే వాహనాలకు థర్డ్ పార్టీ ప్రీమియం రూ. 7వేల849 నుంచి స్వల్పంగా పెరిగి 7వేల 938కి చేరింది. 7500-20,000 కిలోగ్రాముల బరువు తీస్కెళ్లే వాహనాలకు ప్రీమియం తగ్గి రూ.14,330కి చేరింది. ప్రస్తుతం7500-12,000 కిలోల వరకు రూ.14,390,12,000-20,000 కిలోల వాహనాలకు ఇది రూ.15 వేల 365 గా ఉంది.
75 సీసీ వరకు గల ద్విచక్ర వాహనాలకు పెంపు లేదు.75 నుంచి 150 సీసీ వరకు ఉన్న వాటికి ప్రీమియం రూ.619 నుంచి 720కి పెంచారు.150 నుంచి 350 సీసీ వరకు గల వాహనాలకు రూ.970, అంతకు మించితే రూ.1,114 ప్రీమియం ఉంటుంది. త్రిచక్ర వాహనాలకు ప్రీమియం రూ.4,200 నుంచి రూ.5,680కి పెంచారు.

0 comments: