Sunday 2 April 2017

పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానం ఎలా?

న్యూఢిల్లీ: భారతీయ పౌరులకు బయోమెట్రిక్ డేటా ఆధారంగా  ప్రభుత్వం జారీ చేసే  గుర్తింపు కార్డు ఆధార్‌ కార్డ్‌. ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకం చేయడానికి, నల్లధనాన్ని అరికట్టేందుకు చేస్తున్న  ప్రయత్నాల్లో భాగంగా తాజాగా ఆర్థిక శాఖ పాన్‌కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేసింది.  పాన్,  పన్ను రిటర్న్లు దాఖలు కోసం ఆధార్ తప్పనిసరి. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు ఫైల్ చేసేందుకు పాన్‌తో ఆధార్ అనుసంధానాన్ని జులై 1 నుంచి త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. డిసెంబ‌రు 31 తుది గ‌డువుగా  ప్రకటించింది. ఈ గడువు ముగిసిన  త‌ర్వాత పాన్ ఇన్‌వాలిడ్ అవుతుంద‌ని కేంద్రం హెచ్చ‌రిస్తోంది.
 
పాన్ కార్డుతో ఆధార్  అనుసంధానం ఎలా?

మొద‌ట ప‌న్ను చెల్లింపుదారులఇన్‌క‌మ్ ట్యాక్స్ ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ అవ్వాలి. ఇదివ‌ర‌కే యూజ‌ర్ ఖాతా క‌లిగి ఉన్న‌వారు నేరుగా ఈ-ఫైలింగ్ పోర్ట‌ల్‌లో నేరుగా లాగిన్ అయితే సరిపోతుంది.లాగిన్ అయిన త‌ర్వాత‌ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి  వెళ్లి అక్క‌డ లింక్ ఆధార్ అనే ఆప్ష‌న్ క్లిక్  చేయాలి.  ఇక్కడ పేరు,  పేరు, పుట్టిన తేదీ, లింగం వంటి వివ‌రాలను ఎంటర్‌ చేయాలి. ఈ వివ‌రాల‌ను ఆటోమేటిగ్గా స‌రిచూస్తుంది. క్రాస్ చెక్ పూర్త‌యిన త‌ర్వాత మీ నంబ‌రు, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేస్తే.. నిమిషాల్లో ఈ ఆధార్‌ లింకింగ్‌ ప్రక్రియ  పూర్తవుతుంది. వివ‌రాల‌న్నీ స‌రిపోలితేనే ఈ అనుసంధాన ప్ర‌క్రియ స‌జావుగా జ‌రుగుతుంది. అనుసంధానం పూర్త‌యిన వెంటనే స‌మాచారం అందుతుంది.

పాన్‌తో పాటు ఆధార్ అనుసంధానం చేయ‌ని ప‌క్షంలో కొన్ని రోజుల త‌ర్వాత పాన్ ప‌నికిరాకుండా పోతుంద‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.   ఇప్ప‌టికే ఆధార్ లేని వారు దాని కోసం ద‌ర‌ఖాస్తు చేయాల్సిందిగా ప్ర‌భుత్వం సూచించింది.  ఒకవేళ  ఈ మ‌ధ్యే ఆధార్ కోసం దరఖాస్తు చేసుకొని వుంటే అనుసంధానం చేసేట‌ప్పుడు ఎన్‌రోల్మెంట్ నంబ‌రు వేస్తే చాలు.

0 comments: